Biography

 


పేరు                    :   డా॥ బోలుగద్దె అనిల్‌కుమార్‌

జననం                 : 09-02-1986

జననీజనకులు         : శ్రీ వి. బజారన్న ,శ్రీమతి సుంకులమ్మ

స్వస్థలం                 : అమడగుంట్ల (గ్రామం), కోడుమూరు (మండలం),

                            కర్నూలు (జిల్లా) 518 467

విద్యార్థతలు            :

 ఎం.. (తెలుగు, సంస్కృ తము, లింగ్విస్టిక్స్‌), ఎం.ఫిల్‌.,

 పి.జి.దియం.సిడటి.టి.టి., పిహెచ్‌.డి., జె.ఆర్‌.ఎఫ్‌.,

ఉద్యోగం          :  

పూర్వఆంధ్రోపన్యాసకులు, ఆర్‌.జి.యు.కే.టి (ట్రిపులైటి) ఇడుపులపాయ,

 కడపజిల్లా. ప్రస్తుతం నారాయణ '*..ఎస్‌” అకాడమి, హైదరాబాద్‌.


ముద్రిత రచనలు :  

 1. భాగవతపద్యోత్పలమాల (సంకలనం)

2 . ప్రియంవద-ఆశావాదికి అభినందనాక్షరశిల్పాలు (సంకలనం

3.ఆశావాది ప్రకాశరావుగారి వాజ్మయసూచిక

4. The Tree of Heaven (పారాణికకథలకు ఆంగ్లానువాదం)

 5.సౌందర్యభారతి (ఆధునికపద్యకావ్యాలపై విశ్లేషణ)


ముద్రణలోనున్నవి :

 1. శార్వరీవర్న పుష్కర తుంగభద్ర

 2.శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు -ఆనుపూర్వ్యవిభి న్న దృక్పథాలు (ఎం.ఫిల్‌)

 3.మల్లెలమ్మశతకం (నీతి, సాంకేతిక శతకం)

 4.అవధూత ఈశ్వరమ్మచరితము

 5.“కరుణశ్రీ” గారి తెలుగుబాల శతకం (తాత్పర్యరచన)


అముద్రిత రచనలు

 1.గజేంద్రమోక్షణం - ప్రకీర్ణాంశాలు

 2.సూర్యశతకం (తాత్పర్యరచన)

 3.సవారమ్మ శతకం


విశేషాంశాలు

1.ఛైర్మెన్‌-ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (కడపశాఖ)

2.Stony carter (Hyderabad) సంస్థవారిచే “భారతీపుత్ర బిరుదు ప్రదానము -10. 05.2017

3.హిందూధర్మ ప్రచారపరిషత్‌ (తి.తి.దే) ఆధ్వర్యవ ధార్మికోపన్యాసాలు.

 

చరవాణి : 95025 68218 & 86396 63016

ఇమెయిల్‌ : aniltejoshna@gmail.com




      డా! బోలుగద్దె అనిల్‌కుమార్‌ - జీవనరేఖలు


1986వ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన డా॥ బోలుగద్దె బజారన్న, శ్రీమతి సుంకులమ్మ దంపతులకు నాల్గవ సంతానంగా కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలంలో గల అమడగుంట్ల గ్రామంలో డా॥ బోలుగద్దె అనిల్‌కుమార్‌ జన్మించారు. చిన్నప్పటి నుండి నానమ్మ మాదక్క తండ్రి బజారన్నచైెప్పిన పురాణ, ఇతిహాస కథలు అనిల్‌కుమార్‌పై చెరగని ముద్రవేశాయి. తండ్రి వైద్యవృత్తితో పాటు రంగస్థలనటుడు కూడా కావడం వల్ల అనిల్‌కుమార్‌ కూడా కళారంగాన్ని ఎంతగానో ప్రేమించేవాడు.


ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన అమడగుంట్లలోనే గడిచింది. 5వ తరగతి నుండి 10 తరగతి వరకు ్రక్కగ్రామమైన గోరంట్లలోగల గురుకులవిద్యాలయంలో సాగింది. పాఠశాల దశలో ఉన్నప్పుడే పాటలు పాడటం, నాటకాలు వేయడం వంటివి చేయడమేగాక తానే స్వయంగా 8వ తరగతిలో పాటలు రచించి కర్నూలులోని ఆకాశవాణిలో పాడి అందరి మన్ననలను పొందారు అనిల్‌కుమార్‌. తనకచిన్నప్పుడు తెలుగుపట్ల అభిరుచిని కలిగించిన బేబి సువర్ణకుమారి, సంస్కృతంపట్ల అభిరుచిని కలిగించిన ఆవంచ సత్యనారాయణగార్ల ప్రభావం అనిల్‌కుమార్‌పై ఎనలేనిది. వీరు 10వ తరగతి చదువుతున్నప్పుడు గురప్ప అనే తెలుగు ఉపాధ్యాయుడు ఒక తరగతిలో ఛందస్సును బోధిస్తే ఏకసంథాగ్రాహిలా అనిల్‌కుమార్‌ నేర్చుకొని అప్పటికప్పుడు ముప్పైపద్యాలను రచించి చూపారు. 9వ తరగతి చదివేటప్పుడు ఇంగ్లీష్‌ను బోధించిన భాస్కర్‌గారి ప్రభావంతో అనిల్‌కుమార్‌ ఆంగ్లవిద్యలో చక్కని ప్రవేశాన్ని చాటుకున్నారు. అక వీరి ఇంటర్మీడియట్‌ 2002 నుండి 2004 వరకు జూపాడుబంగ్లాలోని సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. అప్పటి వీరి తెలుగు మాష్టారుగారైన ఎల్లాల యతిరాజం నాగేశ్వరరావుగారు అనిల్‌కుమార్‌ను పద్యవిద్యలో రాణింపు పొందునట్లుగా తీర్చిదిద్దారు. అప్పుడే అనిల్‌కుమార్‌ ఆశుకవితలను అలవోకగా అల్లి అందరి విద్యార్థుల, గురువుల అభిమానాన్ని చూరగొన్నారు.

ఇక వీరు డిగ్రీని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కర్నూలులో (2004-2007) పూర్తిచేశారు.వీరు బిజెడ్‌సి గ్రూప్‌లో చక్కని ప్రతిభతో తెలుగు - సైన్స్‌ పురస్కారం పొందారు. డిగ్రీచదివే రోజుల్లో అనిల్‌కుమార్‌ సభల్లోనూ, సమావేశాల్లోనూ పాల్గొంటూ కవితలను, పాటలను రచించి 'యువకవిగా పేరు తెచ్చుకొన్నారు. అప్పుడు డా॥ ఎం. ఆంజనేయులు (హిందీ అధ్యాపకులు) గారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌ కేంద్రీయవిశ్వవిద్యాలయంలో ఎం.. తెలుగుచేసి బంగారుపతకాన్ని పొందారు. అదే విశ్వవిద్యాలయంలోనేశ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సాహిత్యం - చారిత్రక పరిశీలన” అనే పరిశోధనా గ్రంథాన్ని రచించి ఎం.ఫిల్‌ పట్టాను పొందారు. అలాగే అక్కడే ఆచార్య ఎస్‌. ఎన్‌. శరజ్బోత్సారాణిగారి సమక్షంలో “తెలుగుకావ్యావతారికల్లో ఇష్టదేవతాస్తుతి - పరిణామక్రమం” అనే పరిశోధనా గ్రంథానికిగానూ డాక్టరేటును పొందారు.అంతేగాకుండా హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం నుండే మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ టెక్సిక్స్‌ అనే కోర్సుకు (PGDMC&TTT) పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లామానూ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.. సంస్కృతం పట్టాను చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం నుండి ఎం.. లింగ్విస్టిక్స్‌ పట్టాను వీరు పొందారు. కడపజిల్లా - ఇడుపులపాయలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం 2011-2015 వరకు తెలుగు సహాయాచార్యులుగా దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పనిచేసి విద్యార్థుల అభిమానాన్ని పొందారు. వీరు ఇక్కడ ఉన్నప్పుడు తన రచనలకు మరింత పదునుపెట్టారు. అందులో భాగంగానే ఈ క్రింది పుస్తకాలు వెలుగుచూశాయి -


1. భాగవత పద్యోత్ప్సలమాల (సంకలనం)


2. ప్రియంవద (సంకలనం)


3. Tree of Heaven


వీరు ఈ కడపజిల్లాలో పనిచేసేటప్పుడు ప్రతి సెలవుదినం బయటకు వెళ్ళి ఎన్నో సాహిత్యోపన్యాసాలు,ధార్మికోపన్యాసాలను ఇస్తుండేవారు. సాహితీప్రియత్వం కలిగిన విద్యార్థులను ప్రోత్సహించి వారి చేత పుస్తకాలను వ్రాయించి ప్రచురించి స్ఫూర్తిగా నిలిచారు అనిల్‌కుమార్‌. అనిల్‌కుమార్‌ ప్రతిభను గుర్తించి ఇండియన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కడపశాఖ వారు వారికి ఛైర్మన్‌గా, తెలుగు రక్షణవేదిక హైదరాబాద్‌ వారు కార్యదర్శిగా స్థానాలను ఇచ్చి గుర్తింపును కలగజేశారు. తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల వీరు 2016లో నారాయణ ఐఎయస్‌ అకాడమిలో తెలుగు అధ్యాపకులుగా ప్రవేశించారు. సాహిత్యానికి మంచి వేదికడైన భాగ్యనగరం అనిల్‌కుమార్‌ విద్వత్తుకు మెరుగులు దిద్దింది. ఇక్కడ ఉన్నప్పుడు వీరు ఈ క్రింది రచనలు చేశారు-


1. ఆశావాది వాజ్మయ సూచిక


2. భజనకళాసంప్రదాయము


3. గోల్కొండ కావ్యవ్యాఖ్యానము


4. సౌందర్యభారతి


5. మరందవృష్టి


6. సత్యనారాయణ వ్రతకథ - తాత్త్వికత

"7. ప్రతిభాసనం (పరిశోధనావ్వాససంపుటి)


8. సవారమ్మ శతకం

9. మల్లెలమ్మ శతకం (నీతి, సాంకేతిక శతకం)

10. సూర్యశతకం (తాత్పర్యరచన)


11. గజేంద్రమోక్షణం - ప్రకీర్ణాంశాలు


12. భాషారాధనం - భావావగాహనం


ఇక వీరు 40 జాతీయ, 20 అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించారు. అనేక కవిసమ్మేళనాలలో, పండితసభల్లో పాల్గొని తన విద్వత్తును చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధార్మిక ప్రవచనాలను చెప్పడం, అనేకచోట్ల సారస్వతోపన్యాసాలను ఇవ్వడం ధార్మిక సాహితీసభలకు వ్యాఖ్యాతగా సమన్వయకర్తగా వ్యవహరించడం అనిల్‌కుమార్‌గారి నిరంతర కృత్యాలు.వీరి రామాయణ ప్రవచనాలు మలేషియా రాజధానిలోని కౌలాలంపూర్‌లో గల “బ్రిక్సీ అనే చోట సాగడం విశేషం. ఇక అనిల్‌కుమార్‌ గారు వాస్తవానికి సైన్స్‌ విద్యార్థి కావడం వల్ల వీరి రచనల్లో అనేక శాస్త్రాల ఛాయలు కనపడి ఒక విలక్షణతను సంతరించుకుంటాయి. వీరి ప్రతిభను గుర్తించి వరించిన కొన్ని

పురస్కారాలు -

1. 27-09-2016లో కాకినాడలోని రేపూరి ఆశ్రమంలో ఆశుకవితా ప్రదర్శనకు గాను బంగారు ఉంగరంతో సన్మానించడం

2. 2013లో చైతన్యభారతి (హైదరాబాద్‌) వారి ఉగాది పురస్మారం.

3. 2009లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవారి తెలుగుతల్లి పురస్కారం.

4. 2018 మార్చిలో రజతకిరీటధారణా మహోత్సవం

5. ఉత్తర అమెరికా తెలుగుసంఘం వారి ఉత్తమ ఉపన్యాసక పురస్కారం

6. విజ్ఞాన సేవాసమితి వారి (కర్నూలు) ఉత్తమవ్యాఖ్యాత పురస్కారం.


7. సోనీ కార్టర్‌ కంపెనీ వారి నుండి 'భారతీపుత్ర ప్రవచన రాజన్మరాళరాజము అనే బిరుదులు ప్రదానము

చేయబడ్డాయి.


వీరు వ్రాసిన అముద్రితసాహిత్యం ఎంతో ఉంది. వీరు వ్రాసిన సంస్కృత ప్రార్థనాశ్లోకాలు కన్నడ సినిమాయైైన "క్షణిక అనే చలనచిత్రంలో కలవు. 2019లో 400ల కోట్ల వ్యయంతో ప్రముఖ చలనచిత్ర దర్శకులైన గుణశేఖర్‌గారు నిర్మిస్తున్న “హిరణ్యకశ్యప” సినిమా కోసం కొన్ని ఉపకథలను అనిల్‌కుమార్‌ అందించారు. అలాగే ధన్వంతరి క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న “మీగోలమాకేల” చిత్రం కోసం ఏడుపాటలనురచించారు. వీరు చిన్నవయస్సులోనే (22 సంవత్సరాల వయస్సు) ఒక చిన్న నాగ దేవతావేదికను గ్రామపెద్దల సహాయంతో నిర్మించారు. కేవలం కవిత్వాన్ని పాటల, పద్యాల రూపంలో వ్రాయడమే కాకుండా వాటిని అందంగా పాడే వాగ్గేయకారలక్షణం అనిల్‌కుమార్‌లో కనిపిస్తుంది. వీరికి తెలుగులోనే కాకుండా గణితం, వృక్ష భౌతిక, రసాయన, జంతుశాస్తాల్లోనూ, సాముద్రిక, వాస్తుశాస్తాల్లోనూ,పాకశాస్త్ర, చారిత్రక, పురావస్తుశాస్తాల్లోనూ ప్రవేశం కలదు. వీరు ట్రిపులైటిలో పనిచేసినప్పుడు తెలుగు శాఖాధ్యక్షులుగా సాంస్కృతికశాఖా సమన్వయకర్తగా విద్యార్థి సంక్షేమశాఖాధికారిగా పరిపాలనా రంగంలో కూడా బాధ్యతలను నిర్వహించి నాయకత్వ లక్షణాలను పొందారు. మీరు సభలకు అధ్యక్షునిగా, అవధానాలకు సంచాలకునిగా ఉండి వాటిని నడిపించే తీరు సాహితీప్రియులనిట్టే కట్టిపడేస్తుందనటంలో సందేహం లేదు.తెలుగుభాషా సాహిత్యాల నిర్దుష్ట వ్యాప్తికోసం ఎన్నో కళాశాలలకు తిరిగి ప్రచారం చేయడం అనిల్‌కుమార్‌ లోని భాషాభిమానాన్ని గాఢంగా చాటుతున్నది.


Comments